Tuesday, March 1, 2011

ఈసారైనా...

నిన్న రాత్రి కొద్ది రోజులుగా అనుకున్న ఒక రిపోర్ట్ మొత్తంగా పంపించాను. ఈ రోజు కొద్దిగా రిలాక్స్ అవుదామని ఈ మధ్యనే కలిసిన ఒక మిత్రుని (అవినేని భాస్కర్) బ్లాగులు చదువుతూ కూర్చున్నా. భాస్కర్ వేటూరిగారి మీద వ్రాసిన బ్లాగు నాకెంతో నచ్చింది. ఒక్కసారి ఇంతకుముందు నేను మొదలుపెట్టి మధ్యలో వ్రాయడం ఆపేసిన బ్లాగులన్నీ గుర్తుకువచ్చాయి. ఎందుకు మొదలుపెట్టానొ ఎందుకు వ్రాయడం మానేసెనో అర్థం చేసుకోడనికి ప్రయత్నం చేయాగా, ఇంకో సారి ఎందుకు ప్రయత్నించకూడదని అనిపించింది. అందుకే ఇంకో ప్రయత్నం...చూద్దాం..ఈ సారైనా...